కామారెడ్డి, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలని, తద్వారా అందరికీ ప్రాణవాయువు అందుతుందని కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి బత్తుల సత్తయ్య అన్నారు.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన కామారెడ్డి కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. కామారెడ్డి లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి సత్తయ్య మాట్లాడుతూ న్యాయవాదులు ప్రతి సందర్భంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారని అభినందించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్ష పతి మాట్లాడుతూ వివిధ సందర్భాలలో న్యాయమూర్తులు న్యాయవాదులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి సత్తయ్య తో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల భిక్షపతి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేష్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జోగుల గంగాధర్, పూర్వ పిపి వైద్య అమృతరావు మొక్కలు నాటారు.
కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోళ్ల శ్రీకాంత్ గౌడ్, లీగల్ సర్వీసెస్ అథారిటీ బాధ్యురాలు మహాలక్ష్మి, న్యాయవాదులు, కావేటి శ్యామ్ గోపాల్ రావు, పూ నూరి శ్రీనివాస్ రెడ్డి, దేవుని సూర్య ప్రసాద్, జె పి శ్రవణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.