సామాన్యులతో సభాపతి

కామారెడ్డి, అక్టోబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం పద్మాజివాడి చౌరస్తా వద్ద తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బాన్సువాడ నుండి హైదరాబాద్‌ బయలుదేరి పద్మాజివాడి చౌరస్తా వద్ద రైతులని చూసి తన వాహనాన్ని ఆపారు. అక్కడే రైతులతో వున్న మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్‌ రావుతో కాసేపు మాట్లాడి అతి సామాన్యులు వెళ్లే చిన్న హోటల్‌లో వెళ్లి రైతులకు అల్పాహారం చేపించారు. హోటల్‌ బిల్లు సైతం చెల్లించారు.

కార్యకర్తలకు ముఖ్యంగా రైతులకు పంటలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేవిధంగా వ్యవసాయం చేయాలన్నారు. రాబోయే రోజులల్లో ఆహార కొరత ఏర్పడే పెను ప్రమాదం ఉందన్నారు. రైతులు దైర్యంగా రెండు దపాలుగా వరి పంట పండిరచుకోవచ్చన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకం విధానాల వల్ల 2014 సంవత్సరంలో ఆహార భద్రతలో 55 లో ర్యాంకులో ఉన్న భారతదేశం 2022 సంవత్సరం వచ్చేసరికి 107 వ ర్యాంకుకు పడిపోయిందన్నారు

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు లక్షల కోట్లు చేయూతనిస్తు దేశానికి అన్నం పెట్టే రైతులను పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందిననాడే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఈరోజు వ్యవసాయంలో తెలంగాణ రైతులు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నారని అన్నారు. బాన్స్‌వాడ నియోజకవర్గంలో రైతులు సంవత్సరానికి ఖరీఫ్‌ రబీ సీజన్లో పండిరచిన పంటకు 1500 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారన్నారు.

సహచర ఎమ్మెల్యే జజాల సురేందర్‌తో మాట్లాడి సదాశివనగర్‌ మండలంలో రబీ సీజన్‌కు ముందు 2000 మంది రైతులతో రైతు సదస్సు ఏర్పాటు చేస్తే తాను వచ్చి రైతులకు అవగాహన కల్పిస్తానని తెలిపారు. రైతులతో ముచ్చటిస్తూ నేను వంశ పరంపర్యంగా రైతునని రైతు కుటుంబం నుండి వచ్చానని రైతులతో పంట వివరాలు వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సభాపతి వెంట సదాశివనగర్‌ మండల ప్రజాప్రతినిధులు రైతులు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »