నిజామాబాద్, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2010 నుండి 2016 సంవత్సరాల కాలంలో ఆధార్ కార్డు పొందిన వారందరూ తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని ఈ-సేవ జిల్లా మేనేజర్ కార్తీక్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు.
వివిధ ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు సేవలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు పైన పేర్కొన్న కాలంలో ఆధార్ పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. తమ పేరు, చిరునామాను ధృవీకరించే పత్రాలతో సమీపంలో గల ఆధార్ కేంద్రాలను సంప్రదించాలని ఈ-సేవ జిల్లా మేనేజర్ కార్తీక్ సూచించారు.