సరైన వసతులులేని కళాశాలలకు అఫిలియేషన్‌ ఇవ్వొద్దు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కామారెడ్డి జిల్లాలో గల కనీస వసతులు లేని బిఈడి కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్లర్‌ రవీందర్‌ గుప్తాకు వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, జివిఎస్‌, ఏఐఎస్‌బి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఈడీ కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేకుండా తెలంగాణ యూనివర్సిటీ నిబంధనలను పాటించని బిఈడి కాలేజ్‌లప్తెనా చర్యలు తీసుకొని ఆఫ్లియేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం కనీస సౌకర్యాలు లేని నిబంధనలు పాటించని కాలేజీలకు సీట్లు కేటాయించకుండా కాలేజీని వెబ్‌ ఆప్షన్‌ నుంచి తొలగించి బ్లాక్‌ లిస్ట్‌లొ పెట్టాల్సిందిగా వైస్‌ ఛాన్స్‌లర్‌ను కోరారు.

అదేవిధంగా సిప్టింగ్‌ పర్మిషన్‌ తీసుకోకుండా నడిపిస్తున్న కాలేజీలపైన చర్యలు తీసుకోవాలని, కొన్ని కాలేజీలకు సొంత భవనాలు లేకున్నా నడిపిస్తున్నాయని పిర్యాదు చేశారు. కళాశాల భవనాలకు కనీసం అగ్ని ప్రమాద నివారణ జాగ్రత్తలు పాటించని కాలేజీలు ప్తెనా (ఫైర్‌ సేఫ్టీ మెజర్మెంట్స్‌ లేకుండా), కన్వీనర్‌ కోట కింద సీటు వచ్చిన విద్యార్థుల దగ్గర అక్రమంగా ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుండి 25 వేల నుండి 1 లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

ప్రతి సంవత్సరం విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వైస్‌ ఛాన్స్లర్‌ స్పందించి బి.ఎడ్‌ కాలేజిలపై రీ- ఇన్స్పెక్షన్‌ జరిపించాలని కోరారు. వెబ్‌ ఆప్షన్‌ సీట్ల కేటాయించకుండా అర్హతలు లేని బీఈడీ కాలేజీలను బ్లాక్‌ లిస్ట్‌ లొ పెట్టాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

వీసీ రవీందర్‌ గుప్తా సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బొడ అనిల్‌, ఏఐఎస్‌బి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్‌ రెడ్డి, జీవీఎస్‌ జిల్లా అధ్యక్షులు జైత్రాం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు వంశీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »