నిజామాబాద్, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు.
హెల్త్ కార్డు నిరుపయోగంగా మారిందని ప్రైవేటు ఆసుపత్రులు అనుమతించడం లేదని, కార్పొరేట్ వైద్యం కలగా మారిందని, డబ్బు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. అంతేకాక మెడికల్ రియంబర్స్మెంట్ కోసం పెన్షనర్స్ పెట్టిన దరఖాస్తులు నెలలు, సంవత్సరాల తరబడి వైద్య, ఆరోగ్య శాఖలో పెండిరగ్ ఉన్నాయని వారు తెలిపారు.
సమావేశంలో పెన్షనర్స్ నాయకులు, ఈవీఎల్ నారాయణ, ముత్తారం నరసింహస్వామి, రామ్ మోహన్ రావు, ఎం. జార్జ్, ప్రసాద్, సిర్ప హనుమాన్లు, బట్టి గంగాధర్, జస్వీర్ సింగ్, పోచద్రి, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.