రెంజల్, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం రెంజల్ గ్రామానికి చెందిన శ్రావన్ గౌడ్ (29) ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు.
గత కొంతకాలంగా మృతుడు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.