కామారెడ్డి, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతోపాటు సైబర్ నేరగాళ్లం చేతుల్లో మోసపోయిన బాధితులకు ఏ విధమైన సహకారం అందించడం జరుగుతుందో, సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ విభాగం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసేందుకుగాను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రేపు అనగా 21వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు అడిషనల్ ఎస్పీ పరిపాలన అనొన్య ప్రజలకు ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉంటారన్నారు.
కార్యక్రమంలో భాగంగా ప్రజలు అడిగే సైబర్ నేరాలపై ఎటువంటి సందేహాలకైనా, సమస్యలకైనా అడిషనల్ ఎస్పీ సమాధానం అందిస్తారని, సలహాలు సూచనలు తెలియజేస్తారన్నారు. కావున ప్రజలు కేవలం సైబర్ నేరాలపై ఉన్న అనుమానాలు సందేహాలు తెలుసుకునేందుకు మాత్రమే అని, 8985333321 నెంబరుకు ఫోన్ చేయగలరని వివరించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా చైతన్యపరచడమే జిల్లా పోలీసుల ముఖ్య ఉద్దేశమని అన్నారు.