మునుగోడు గెలుపు ఓటములు కాదు… రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోనే ధాన్యం దిగుబడిలో అన్నపూర్ణగా జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జిల్లా రైతుల ఖరీఫ్‌ సీజన్‌ పంట కోతల దశలో ఉందని, ధాన్యం కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు గెలుపు ఓటములను చర్చిస్తూ రాష్ట్ర పాలన గాడితప్పేలా ఉందని బోధన్‌ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ
సీనియర్‌ నాయకుడు వి.మోహన్‌ రెడ్ది అన్నారు. బుధవారం స్టానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సీజన్‌లో పండిన ధాన్యం 8 లక్షల మెట్రిక్‌ టన్నులతో రాష్ట్రంలో నిజామాబాద్‌ నెంబరు వన్‌గా నిలిస్తే, రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా ధాన్యం కొనుగోలులో స్పందించకపోవడంతో రైతు అనేక ఇబ్బందులకు గురయ్యాడని అన్నారు. ప్రస్తుత సీజన్‌లో 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రానున్న సందర్భంగా ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం రైతుల నుండి వెంట వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా, మిల్లర్లకు టెండర్లు పిలిచి ధాన్యాన్ని వెంట వెంటనే పొరుగు రాష్ట్రాలకు చేర్చేలా మరియు ప్రక్క రాష్ట్రాల మిల్లర్లతో ఎంఎస్‌పికి తగ్గకుండా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.

రైతు క్షేమాన్ని ఆలోచించి దేశంలోని ఇతర రాష్ట్రాలు మరియు ఇతర దేశాలకు పండిన ధాన్యం ఎగుమతి అయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. నేడు రాష్ట ప్రభుత్వ యంత్రాంగం, మంత్రి మండలి, డిజిపి వంటి అధికారులు మునుగోడులో ఉంటే, ముఖ్యమంత్రి ఢల్లీిలో ఉన్నారని ఇటు పంట కోతల సీజన్‌లో అకాల వర్షాలు, రైతుకు పంట చేతికొచ్చే తరుణంలో వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

పండిన పంట ధాన్యాన్ని అకాల వర్షాల నుండి తడువకుండా టార్పాలిన్‌ కవర్లు, వెంట వెంటనే కల్గ్లాల నుండి మిల్లులకు, మిల్లుల నుండి ఇతర రాష్ట్రాలకు ధాన్యంను రవాణా చేసే చర్యలు చేపట్టాలని హితవు పలికారు. లేకుంటే గత సీజన్‌లో మాదిరిగా ధాన్యం తడిసి కల్లాల్లోనే మొలకలు వచ్చిన దశలో అట్టి ధాన్యాన్ని గోదావరిలో పోసిన సందర్భాలు పునరావృతం కావద్దన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలకు అతీతంగా రైతులను నష్టపర్చకుండా ఆదుకోవాలని, పంట కోతల దశలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా మోహన్‌ రెడ్డి కోరారు. సమావేశంలో బిజెపి నాయకులు రచ్చ సుదర్శన్‌, శైలేళ్‌ కుమార్‌, రెంజల్‌ జడ్పిటిసి విజయ్‌ సంతోష్‌, ఎడపల్లి మండల అధ్యక్షుడు కమలాకర్‌ రెడ్డి, రమణారావు, సత్యంరెడ్డి, ఎంపిటిసి గంగాదాస్‌, కె. శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »