వేల్పూర్, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామానికి చెందిన విల్లేశ్వర్ హరీష్ (33) స్వర్ణకారుడు గ్రామ శివారు ప్రాంతంలో శారద ఆశ్రమం దగ్గర్లో చెట్టు కింద కాలిన గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా ఆర్మూర్ రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
ప్రశాంతంగా ఉన్న అమినాపూర్ గ్రామ శివారులో తెల్లవారుజామునే ఒక్కసారిగా భయంకరమైన స్థితిలో కాలిన గాయాలతో శరీరంపై బట్టలు లేకుండా శవాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వేల్పూరు ఎస్ఐ వినయ్ కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా సిఐ గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ అమినాపూర్ గ్రామానికి చెందిన మృతుడు హరీష్ (33), భార్య, కుమారుడు 7 సంవత్సరాలు, స్వర్ణకారుడుగా పని చేసుకుంటూ ఉండేవాడని గురువారం ఉదయం బయలుదేరిన హరీష్, ఇంటికి రాకుండా ఫోన్ ద్వారానే రాత్రి మాట్లాడడం జరిగిందని భార్య తెలిపారని అన్నారు. తెల్లవారుజామున ఉదయం కాలిన గాయాలతో కూడిన మృతుడు హరీష్ ఉన్నారని ఆయన తెలిపారు.
క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ పిలిపించి కేసు పూర్వపరాలు పరిశీలిస్తున్నామన్నారు. ఇంకా సీ.డి.యార్, మెడికల్ పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత దర్యాప్తు చేస్తామని సి.ఐ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.