68వ సారి రక్తదానం చేసిన బాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌విఆర్‌ వైద్యశాలలో పట్టణానికి చెందిన జీవన జ్యోతి (35)కు డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో ప్లేట్‌లేట్ల సంఖ్య తగ్గిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్‌ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు ను సంప్రదించారు. అర్ధరాత్రి వేళ అయినా వెంటనే స్పందించి 68వ సారి సకాలంలో రక్తాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా రక్తదాత డాక్టర్‌ బాలు మాట్లాడుతూ రక్తదానం పట్ల సమాజంలో ఉన్న అపోహలను విడనాడాలని, రక్తదానం చేయడం వల్ల రక్తదాతలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఇతరుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ఆరోగ్యవంతమైన వ్యక్తులు ప్రతి సంవత్సరానికి 4 సార్లు రక్తదానం, ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్‌ లేట్లను అందజేయవచ్చును అన్నారు.

ఐవిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర పర్యాటక టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను పేద విద్యార్థుల చదువుల కోసం ఆర్థిక సాయం అందజేయడం, పేదింటి ఆడపడుచుల వివాహాల కోసం పుస్తె మట్టలను అందజేయడం వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఐవీఎఫ్‌ ఆధ్వర్యంలో సకాలంలో రక్తాన్ని అందజేస్తామని అన్నారు.

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సహకారంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎల్లవేళలా రక్తాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో దేవేందర్‌, కె.బి.సి బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది జీవన్‌, సతీష్‌, రమేష్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »