ఎడపల్లి, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షణ భారత దేశంలో పవిత్రమైన అష్ఠముఖి కోనేరు గల జానకంపేట్ శివారులోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ కమిటీ ఎన్నికకు దరఖాస్తులు ఆహ్వానిస్తూనట్లు ఎండో మెంట్ సహాయ కమిషనర్ సోమయ్య ఓ ప్రకటనలో తెలిపారు.
గతంలో వెలువడిన నోటిఫికేషన్ గడువు తీరడంతో కమిటీ ఎన్నికకు మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తూనట్లు అయన తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైన 20 రోజుల్లో అప్లికేషన్‌ను నింపి దేవాదాయ ధర్మాదాయ శాఖా కమీషనర్ హైదరాబాద్‌కు, సహాయ కమీషనర్ నిజామాబాద్‌కు పంపాలని కోరారు.