నిజామాబాద్, అక్టోబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలు విలసిల్లాలని వారు ఆకాంక్షించారు.
చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని హితవు పలికారు.