ఎడపల్లి, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సూర్య గ్రహనం సందర్బంగా మంగళవారం బోధన్ నియోజక వర్గంలోని పలు ఆలయాలకు తాళాలు పడ్డాయి. ఆలయాల ద్వారాలు మూసి వేయడంతో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పూజలన్నీ బంద్ అయ్యాయి.. పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఆలయ ద్వారాలన్ని బంధనం చేసారు.
ఆలయాల్లోని అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేసారు. ఈ మేరకు ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని ఉదయమే మూసి వేశారు. రాత్రి 7 గంటలకు పలు ఆలయాల్లో సంప్రోక్షణ, స్వామివారికి అభిషేకం, మంగళ హారతి, నివేదన నిర్వహించి తిరిగి తెరవగా, మరికొన్ని ఆలయాల్లో బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ నిర్వహించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవలు ప్రారంభించనున్నారు.