కామారెడ్డి, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా దొంగల ధర్మారానికి చెందిన మల్లవ్వ (58) కి అత్యవసరంగా గుండె ఆపరేషన్ నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల క్రియాశీలక సభ్యుడు పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన గోల్కొండ రాజు, పరుశురాం, ధర్మారం గ్రామానికి చెందిన రాజు ములుగులో గల ఆర్వీఎం వైద్యశాలలో మంగళవారం 3 యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేశారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ అన్నిదానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, డబ్బుతో కొనలేనిది కేవలం రక్తం మాత్రమేనని మంచి మనసున్న మనుషులు ముందుకు వచ్చినప్పుడే ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరుగుతుందని, ప్రాణాపాయ స్థితిలో వ్యక్తులు బాధపడుతూ ఉంటే వారిని కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తిపై ఉందన్నారు.
నాకెందుకులే అని అనుకుంటే వారి ఇంట్లో కూడా భవిష్యత్తులో రక్తం అవసరమైనప్పుడు ఇవ్వడానికి ఎవ్వరు కూడా ముందుకు రారన్నారు. నిస్వార్ధంగా రక్తదానానికి ముందుకొచ్చిన రక్తదాతలు గోల్కొండ రాజు, పరుశురాం, రాజులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. రక్తదానం చేయాలనుకునేవారు 9492874006 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.