నిజామాబాద్, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అందే సాయిలు సతీమణి సుధారాణి బ్రెయిన్ స్ట్రోక్‌తో మంగళవారం మరణించారు. ఈమె నిజామాబాద్ కోర్టులో టైపిస్ట్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆమె ఐదు ఆర్గాన్స్ గుండె, కాలేయం, కిడ్నీ, కండ్లు తదితర అవయవాలను దానం చేశారు.
ఆమె చనిపోయి 8 మంది జీవితాలలో వెలుగులు నింపారు. బుధవారం ఆమె అంత్యక్రియలు గంగాస్తాన్ నందు నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కోర్టు సిబ్బంది, పలువురు అడ్వకేట్లు అంత్యక్రియలలో పాల్గొన్నారు.