నిజాంసాగర్, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న దుస్తులను వైస్ ఎంపీపీ మనోహర్, ఉప్ప సర్పంచ్ దుర్గాప్రసాద్, నాయకులు విఠల్ రెడ్డి, బాబు సెట్ చేతులు మీదుగా అందజేశారు.
అలాగే దాతలు అందించిన టై, బెల్టు, ఐడి కార్డులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, తదితర అన్ని రంగాలలో ముందుండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోటయ్య,ఉపాధ్యాయులు మారుతి, విజయ కుమారి, జయశ్రీ, రవీందర్, కంప్యూటర్ ఆపరేటర్ హరీష్, తదితరులు ఉన్నారు.