రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ కి రక్తదానం

కామారెడ్డి, జూన్ 10

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ కు చెందిన పర్హన బేగం (23) గర్భిణీ స్త్రీ బాన్సువాడ ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ను సంప్రదించారు.

వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తాన్ని పెద్దమల్లారెడ్డికి చెందిన ఏర్వ రవీందర్ సహకారంతో 2 యూనిట్లు అందజేయడం జరిగిందని తెలిపారు.

ఆపద సమయంలో రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుందని అయినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరం అయినట్లయితే సంప్రదించాలని తెలిపారు.

కార్యక్రమంలో గోల్కొండ రాజు, వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ఏసుగౌడ్ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »