కామారెడ్డి, అక్టోబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో తొలిమెట్టు మౌలిక భాష గణిత సామర్ధ్యాల సాధన కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.
ప్రాథమిక స్థాయిలో విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి మెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. బోధన పరికరాలను ఉపయోగించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేపట్టాలని సూచించారు.
విద్యార్థుల సమర్థ్యాలను రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, సమన్వయకర్తలు వేణుగోపాల్, శ్రీపతి, ఉమారాణి, మనోహర్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.