రెంజల్, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని జెడ్పిటిసి విజయ, విండో చైర్మన్ మోహినోద్దిన్ అన్నారు. ఆదివారం వీరన్న గుట్ట గ్రామంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ప్రతి రైతు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రహించాలని విక్రయించాలి అన్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడు ధాన్యానికి రూ.2060 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2040 రూపాయల ద్వారా కొనుగోలు చేస్తున్నారని, ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్‌లు రాజు, గణేష్, రైసస డైరెక్టర్ మౌలానా, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు మేక సంతోష్, బిఆర్‌ఎస్ నాయకులు భూమేష్, లింగారెడ్డి, అనంత్ రావ్, సనహుల్హాక్, జుబేర్, రాజు, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.