కామారెడ్డి, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పథకాలు షెడ్యూల్డ్ కులాల వారికి అందే విధంగా మానిటరింగ్ కమిటీ ప్రతినిధులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలోని షెడ్యూల్డ్ కులాల వారికి అందే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందే విధంగా చూడాలన్నారు.
ప్రతినెల చివరి రోజున గ్రామాల్లో అంటరానితనంపై అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అన్యోన్య, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ ప్రతినిధులు పుట్ట మల్లికార్జున్, మల్లయ్య, రాజన్న, అధికారులు పాల్గొన్నారు.