కామారెడ్డి, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండిరగ్ దరఖాస్తులను అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారించాలని కోరారు.
ప్రజావాణిలో భూ సమస్యలు పరిష్కారం కోరుతూ వచ్చే ఫిర్యాదులు రెవెన్యూ అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. సోమవారం ప్రజావాణికి మొత్తం 56 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఆర్ డిఓ సాయన్న, ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.