కామారెడ్డి, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ వారి షబ్బీర్ అలీ పౌండేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు రోగులకు రక్తం అందించి వారిని కాపాడారు.
గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు రోగులకు అత్యవసరంగా రక్తం అవసరం కాగా సహాయం కొరకు షబ్బీర్ అలీని ఫోన్ లో సంప్రదించారు. వెంటనే స్పందించి తన ఫౌండేషన్ ద్వారా వడ్ల సాయి కృష్ణ, షేక్ ముక్తార్ హైమద్ ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి రక్తదానం చేయించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కాపాడారు.