కొనసాగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన

నిజామాబాద్‌, నవంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌ ట్రైనీ అధికారుల (అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌) క్షేత్రస్థాయి పరిశీలన జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శిక్షణలో భాగంగా గ్రామ స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ట్రైనీ అధికారుల బృందం అక్టోబర్‌ 31 న జిల్లాకు చేరుకున్న విషయం విదితమే.

ఈ నెల 4 వ తేదీ వరకు ట్రైనీ అధికారుల బృందాలు వారికి కేటాయించిన గ్రామాల్లో వివిధ అంశాలను పరిశీలన జరుపనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆర్మూర్‌ మండలం మిర్దాపల్లి, జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్‌లో ట్రైనీ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్ర స్థాయిలో ఆయా అంశాలను అధ్యయనం చేశారు.

Check Also

ఉత్సాహంగా జిల్లాస్థాయి క్విజ్‌ పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేరా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »