కామారెడ్డి, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం సాయంత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై తెరాస దాడికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూచన మేరకు, కామారెడ్డి బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్ చౌరస్తా దగ్గర కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అద్యక్షుడు విపుల్ జైన్ మాట్లాడుతూ మునుగోడులో బీజేపీ విజయం ఖాయం అయ్యిందని, ఓటమి అసహనంతో అధికార పార్టీ నాయకులు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌పై దాడులకు దిగటం సిగ్గు చేటు అని, ప్రజలు తెరాస పార్టీకి సరిjైున గుణ పాఠం చెప్తారని, 6వ తేదీన మునుగోడులో కమలం వికసిస్తుంది అన్నారు.
బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో అధికార పార్టీ అసత్య ప్రచారాలు చేస్తున్నదని, నిన్న ఆర్ఎస్ఎస్ సర్వే పేరిట అసత్య ప్రచారం, బండి సంజయ్ నడ్డకి లేఖ రాసినట్టుగా రాత్రి అసత్య ప్రచారం చేశారని వారిలో ఓటమి భయం స్పష్టంగా కనపడుతుందని, మునుగోడు ఉప ఎన్నికనే కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుందని అన్నారు.