రెంజల్, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల సర్వసభ్య సమావేశం గురువారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రజిని కిషోర్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన శాఖలకు సంబంధించిన విషయాలపై చర్చించి మిగతా శాఖలను కొనసాగించకుండానే మండల సభ్య సమావేశం ముగించారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన ఎన్‌ఎస్‌ఎఫ్ భూముల రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించాలని వైస్ ఎంపీపీ యోగేష్ సభ దృష్టికి తీసుకువచ్చారు.
అవసర నిమిత్తం లబ్ధిదారులు తమ భూమిని విక్రయించుకునేందుకు నానా అవస్థలకు గురైతున్నారని ప్రభుత్వ సంబంధించి ఎన్‌ఎస్ భూముల రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించాలని కోరారు. అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని నీలా విండో చైర్మన్ ఇమామ్ బేగ్ అన్నారు. గ్రామపంచాయతీకి సంబంధించిన కరెంట్ బిల్లులు అధికంగా రావడంతో చెల్లించలేక ఇబ్బందులు కలుగుతున్నాయని మండల సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చారు.
గ్రామపంచాయతీకి బిల్లులు లేక గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని కరెంటు బిల్లులు అధికంగా వేయడంతో ఇబ్బందికరంగా ఉందని కరెంట్ బిల్లుల కొరత తీర్చాలని నెలకు ఒకేసారి కరెంట్ బిల్లు కొట్టాల్సింది పోయి రెండు నెలలకోసారి కరెంట్ బిల్లులు కోట్టడంతో అధికంగా చార్జీలు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. విద్యార్థులకు సమయపాలన కనుక్కునంగా బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఎంపీపీ రజిని కిషోర్ కోరారు.
పేపర్ విల్ గ్రామంలో నూతనంగా ప్రారంభించిన పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో పంచాయతీరాజ్ లిఖిత ప్రోటోకాల్ పాటించకుండా పంచాయతీ భవనాన్ని ప్రారంభించారని వైస్ ఎంపీపీ యోగేష్ పిఆర్ ఏఈ ని నిలదీశారు. సమావేశంలో ఎంపీడీఓ శంకర్, తహశీల్దార్ రాంచందర్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.