నిజామాబాద్, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశవ్యాప్త రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల డిమాండ్స్ డే సందర్భంగా నిజామాబాద్ కొత్త కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు గురువారం ధర్నా నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
పెండిరగ్‌లో ఉన్న పెన్షనర్ల బకాయిలను ఏక మొత్తంలో వెంటనే చెల్లించాలని, మూడు విడతల డిఆర్‌లను తక్షణమే విడుదల చేయాలని, ఫ్రీ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసిన ఉద్యోగులతో సహా అందరికీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
శాస్త్రుల దత్తాత్రేయ రావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో పలువురు మాట్లాడారు. ఈ కుబేర్లో బిల్లులు పేరుకు పోతున్నాయని, ధనిక రాష్ట్రంలో పెన్షన్లు సకాలంలో అందటం లేదని ఆరోపించారు. కనీస పెన్షన్ 12000 ఇవ్వాలని, రైల్వే ఆర్టీసీలలో, సీనియర్ సిటిజన్స్‌కు ప్రయాణాలలో రాయితీలు ఇవ్వాలని, గత పిఆర్సి చేసిన సిఫార్సులను అమలు చేయాలని పెన్షనర్లకు ఇన్కమ్ టాక్స్ నుండి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
లైబ్రరీ గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు హెల్త్ స్కీమును అమలు చేయాలని జీరో వన్ జీరో కింద వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కే రామ్మోహన్రావు, ఉపాధ్యక్షులు ముత్తారం నరసింహస్వామి, ప్రసాద్ రావు, శిర్ప హనుమాన్లు, అందే సాయిలు, కృష్ణారావు, మదన్ మోహన్, సాయన్న, శంకర్, రాధా కిషన్, భోజరావు, రాజేశ్వర్, పుండరీ, లక్ష్మీనారాయణ, జస్వీర్ సింగ్, గంగారాం, తదితరులు మాట్లాడారు. అధిక సంఖ్యలో వయోవృద్ధులతో సహా పెన్షనర్లు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారికి మెమోరాండం సమర్పించారు.