ఆధార్‌ కార్డులు అప్‌డేట్‌ చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదేళ్ల వ్యవధి దాటిన ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా రూపొందించిన వాల్‌ పోస్టర్లను కలెక్టర్‌ తన చాంబర్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆధార్‌ ను అప్‌ డేట్‌ చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు.

వివిధ ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు సేవలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు గాను పదేళ్ల క్రితం ఆధార్‌ పొందిన ప్రతి ఒక్కరూ ప్రస్తుతం తప్పనిసరిగా నవీకరించుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు, ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు, రేషన్‌ సరుకులను దేశవ్యాప్తంగా ఏ ప్రాంతం నుండి అయినా పొందేందుకు అప్‌డేట్‌ చేసుకున్న ఆధార్‌ ఉపయోగపడుతుందని వివరించారు.

పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సమీపంలో గల ఆధార్‌ కేంద్రాలలో అప్‌ డేట్‌ చేసుకోవాలని తెలిపారు. మైఆధార్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చని అన్నారు. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 1947 నెంబరుకు కాల్‌ చేయవచ్చని, కు మెయిల్‌ చేసి పూర్తి సమాచారం పొందవచ్చని అన్నారు.

జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. కార్యక్రమంలో యూఐడీఏఐ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయ సహాయ జనరల్‌ మేనేజర్‌ శోబన్‌, ఈ-సేవ జిల్లా మేనేజర్‌ కార్తీక్‌, టీఎస్టీఎస్‌ డీ.ఎం అర్జున్‌, ఆధార్‌ కేంద్రాల నిర్వాహకులు షాహిద్‌, ఖావిన్‌, లక్ష్మీనారాయణ, నసీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »