రెంజల్, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జూడో యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ జావిధోద్దీన్ అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు సభను మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ భారీ బహిరంగ సభకు మండలంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి మేనూరు సభను విజయవంతం చేయాలన్నారు.
సమావేశంలో మాజీ మండల అధ్యక్షుడు సిహెచ్ రాములు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, ఎంఎల్ రాజు, పోచయ్య, కార్తిక్, లోక కృష్ణ, గైని కిరణ్, సిద్ద సాయిలు, శ్రీనివాస్, శంషోద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.