నిజాంసాగర్, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని మొహమ్మద్ నగర్ గ్రామంలో బూర్గుల్ గ్రామానికి చెందిన సుధాకర్‌కు దళిత బంధు పథకం కింద మంజూరైన కారులు ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దఫెదర్ రాజు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సీడీసీ చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బందు కింద దళితులందరూ ఎదగాలని ఉద్దేశంతో దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, నాయకులు విజయ్ కుమార్, అప్జల్, కాశయ్య, ఇఫ్తాకర్, రామగౌడ్, మనీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.