రెంజల్, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించడంతో ఆదివారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. బాణ సంచాలు పేల్చి మిఠాయిలు పంచి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమరెడ్డి, స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ఉప ఎన్నిక ఎక్కడ జరిగిన గెలుపు బిఆర్ఎస్దేనని బిఆర్ఎస్ గెలుపుతో మోడీ ప్రభుత్వానికి మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధితోనే మునుగోడులో బిఆర్ఎస్ గెలుపు సాధ్యమైందన్నారు.
బిఆర్ఎస్ తోనే ప్రజలు మమేకమై ఉన్నారని మోడీ, కేడీలు వచ్చిన కేసీఆర్ను ఢీ కొట్టేవారు లేరని అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రఫిక్, ధనుంజయ్, గోపాల్ రెడ్డి, షబ్బీర్, అగ్గు నారాయణ, మూకీద్, అబ్బోల్ల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.