కామారెడ్డి, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలానికి చెందిన కట్లకుంట బసవవ్వ (58)కి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికోవర్ వైద్యశాలలో గుండె ఆపరేషన్ నిమిత్తమై బిపాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు రెడ్ క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
నిజామాబాద్ రక్తదాతల సమూహ నిర్వాహకుడు బచ్చు శ్రీధర్ సహకారంతో గజానంద్ ఇండస్ట్రీలో సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న రక్తదాత ఆకాష్ వెంటనే స్పందించి ఆపరేషన్‌కి కావలసిన బి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో అందజేసే ప్రాణాలను కాపాడడం జరుగుతుందని, రక్తదానానికి ముందుకు వచ్చిన, రక్తదానానికి సహకరించిన బచ్చు శ్రీధర్ కుమార్, రక్తదాత ఆకాష్‌కు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కామారెడ్డి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు.