కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గాంధారి, జూన్ 10

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో 187 మంది లబ్ధిదారులకు సుమారు రెండు కోట్ల రూపాయలు కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజ‌ల సురేంద‌ర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని బంగారు తెలంగాణ సాధన ఒక్క కెసిఆర్ నాయకత్వంలో మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు.

24 గంటల కరెంటు మన కళ్ళకు కనబడుతుందని, రైతు బీమా, రైతుబంధు పథకాలు అభివృద్ధికి నిదర్శనం అని, అతి త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించడం ప్రారంభమవుతుందని, త్వరలోనే రేషన్ కార్డులకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతుందని, తొందరలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు అందుతాయని, గాంధారి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు పనులు ప్రారంభించ పోతున్నామని తెలిపారు.

కార్య‌క్ర‌మంలో గాంధారి మండల తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »