ఏ ఎన్నికలైన ప్రజలంతా కేసీఆర్‌ వెంటే

నిజామాబాద్‌, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవ్వాక్కులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని, మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడిరచారు. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్‌ఎస్‌ వైపేనని ఆమె స్పష్టం చేశారు.

సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మునుగోడులో టిఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని రోజులు అవక్కులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని అన్నారు.

నల్గొండలో హ్యాట్రిక్‌ సాధించామని, ఇక తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్‌ఎస్‌ వైపే ఉంటారనే విశ్వాసం తనకు ఉందని అన్నారు. ప్రతి ఏడు లాగానే ఈసారి కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించానని చెప్పారు.

ఆలయంలో స్వామివారి రథం అవసరం ఉన్నట్లు ఆలయ కమిటీ వారు అడిగారని ఇందుకోసం 50 లక్షలతో రథాన్ని ఏర్పాటు చేయిస్తానని వెల్లడిరచారు. ఎంతో మహిమగల నీలకంటేశ్వరున్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »