నిజామాబాద్, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు తమ అవసరాల నిమిత్తం నూతన కలెక్టరేట్‌లో ఉన్న ట్రెజరీ ఆఫీసుకు రావడం చాలా కష్టంతో కూడుకున్నదని, పెన్షనర్స్ ట్రెజరీ ఆఫీసును పాత కలెక్టరేట్‌కు మార్చాలని కోరుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
లైఫ్ సర్టిఫికెట్లు గురించి,పెన్షన్‌కు సంబంధించిన అనేక అంశాలలో వయోవృద్ధులైన పెన్షనర్లు సుదూరంగానున్న సమీకృత కలెక్టరేట్‌కు రావటం, వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదని, ఎస్.టి.ఓ పెన్షన్ ఆఫీసును అందరికీ అందుబాటులో ఉండే విధంగా పాత కలెక్టరేట్‌కు మార్చాలని వారు కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి కే. రామ్మోహన్రావు ఉపాధ్యక్షుడు సుదర్శన్ రాజు, శిర్ప హనుమాన్లు, జార్జ్, ప్రసాద్, నర్రా రామారావు, లింగయ్య రాధా కిషన్ తదితరులు ఉన్నారు.