కామారెడ్డి, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తల్లి గంప రాజమ్మ గత గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. కాగా సోమవారం గంప రాజమ్మ మరణం పట్ల స్వగ్రామం బస్వాపూర్ గ్రామంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ విజి గౌడ్, టిస్కబ్ చైర్మన్ రవీందర్ రావు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వారి మాతృమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గంప గోవర్ధన్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.