భీమ్‌గల్, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భావనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని లింబాద్రి లక్ష్మి నరసింహ స్వామిని ప్రార్థించారు.
రథోత్సవంలో పాల్గొన్న మంత్రికి లింబాద్రీ జాతరకు వచ్చిన ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గుడి అభివృద్ది, గుడికి వెళ్ళే దారిని డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ తో పాటు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణమంతా సుందరీకరించిన విషయాన్ని ప్రజలు మంత్రితో పంచుకున్నారు.
రోడ్లు బాగా చేశారు, సౌకర్యాలు బాగున్నాయి అంటూ పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ప్రత్యేక చొరవతో భీంగల్ లింబాద్రి గుట్ట పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. మంత్రి వేములతో సెల్ఫీ కోసం యువకులు, జాతరకు వచ్చిన భక్తులు ఎగబడ్డారు. మంత్రి ఓపికతో వారితో మమేకమయ్యి ఫోటోలు దిగారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.