వేలం పాటను అడ్డుకుంటాం

నిజామాబాద్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ భూముల అమ్మకాలను వెంటనే నిలిపివేయలని సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, జిల్లా కార్యదర్శి సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. నగర శివారులోని మల్లారం ప్రాంతంలో ధాత్రి టౌన్షిప్‌ పేర వ్యవసాయ ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి వేలం వేయడాన్ని ఆపివేయాలని, లేనియెడల వేలంపాటను అడ్డుకుంటామని సిపిఐ నాయకులు హెచ్చరించారు.

మంగళవారం సిపిఐ బృందం కే. భూమయ్య, పి.సుధాకర్‌, వై ఓమయ్య, రంజిత్‌, రఘురాం, హనుమాన్లు మల్లారం దాత్రి లేఅవుట్‌లో జరుగుతున్న పనులను సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ నగరంలో నివసించే పేద ప్రజలకు గుడిసె వేసుకోవడానికి ఇళ్ల స్థలాలు, డబుల్‌ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాలకు స్థలాలు లేవని చెప్తున్న ప్రభుత్వ యంత్రాంగం నిజామాబాద్‌ మండలం మల్లారంలో ధాత్రి లే అవుట్‌ పేరుతో ప్రభుత్వ స్థలాలను అమ్ముకుంటుందని ఆరోపించారు.

మల్లారం గ్రామ శివారులో గల భూమి 76 ఎకరాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఇండ్ల స్థలాల కోసం చదును చేయించి ప్రభుత్వ స్థలాన్ని వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఒక్కో ప్లాట్‌ 200గజాలు, 300 గజాలుగా తయారుచేసి గజానికి 8వేల రూపాయలు ప్రభుత్వం ధర నిర్ణయించడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.

మల్లారం లే అవుట్‌ స్థలాలకు ప్రభుత్వమే 8వేల రూపాయలకు గజం నిర్ణయిస్తే మల్లారం చుట్టుపక్కల భూములకు, నగరంలో ఉన్న ప్రైవేటు భూములకు రెక్కలు వస్తాయని, దీంతో మధ్య తరగతి సామాన్యులు ఇండ్ల స్థలాలను జీవితంలో ఎప్పుడు కొనలేరని సిపిఐ నాయకులు అన్నారు. ఇండ్ల స్థలాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎన్నోసార్లు సర్వే చేసి అర్హులని తెలిసిన వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం, అధికారులు కాలయాపన చేస్తున్నారని, దాత్రి లేఔట్‌ లో ఇళ్ల స్థలాలను ఉచితంగా కేటాయించి రెండు పడక గదుల ఇండ్లను మంజూరు చేసి పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వం వేలంపాట వేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ధాత్రి టౌన్షిప్‌ వద్దకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ కు టౌన్షిప్‌కు వెళ్లే రహదారికి నష్టపోతున్న రైతులకు న్యాయం చేయాలని సిపిఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »