చదువుల తల్లికి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే

లింగంపేట్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండలం భవానిపెట్‌ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గర్నే రసజ్ఞ ఇటీవల వెల్లడిరచిన నీట్‌ ఫలితాల్లో ఎంబీబీస్‌ సాధించగా ఆ విద్యార్థికి మంగళవారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజల సురేందర్‌ క్యాంప్‌ కార్యాలయంలో రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదువుకొని తలిదండ్రులకు మంచిపేరు తేవాలని, డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలని విద్యార్థికి సూచించారు. కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు రమేష్‌, తెరాస సీనియర్‌ నేత ఒంటరి సిద్దిరాం రెడ్డి, సర్పంచ్‌ నరసమ్మ ప్రకాష్‌, ఎంపీటీసీ సురేందర్‌, ఉపసర్పంచ్‌ కొలిమి కుమార్‌, తెరాస గ్రామకమిటి అధ్యక్షుడు మదర్‌ పాషా, తెరాస నేతలు పుట్నాల మనోహర్‌, బ్యాగారి సాయిలు, మహిపాల్‌ రెడ్డి, విద్యార్థిని తండ్రి సంగయ్య, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు సకృ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »