కామారెడ్డి, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లో ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న ప్రజలు కలెక్టర్ కామారెడ్డి పేరిట రూ.10 వేలు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్షిప్‌ను బుధవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ లేఅవుట్ అప్రూవల్ ఉందని సూచించారు. విద్యుత్ సౌకర్యం, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. మూడో విడత వేలం పాట ఈనెల 14 నుంచి 18 వరకు కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కొనసాగుతుందని తెలిపారు.
ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధరణి టౌన్షిప్ లో తక్కువ ధరకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.అల్లాదకరమైన వాతావరణంలో ఈ ధరణి టౌన్షిప్ ఉందని చెప్పారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలకే ఇంటి స్థలం కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్నారైలు సులభ వాయిదాల వెసులుబాటుతో రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకుల సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సకల సదుపాయాలతో ధరణి టౌన్షిప్ రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.