కామారెడ్డి, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో తక్కువ ధరలకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్షిప్లో గురువారం పిఆర్టియు, టిఎన్జిఎస్ ఉద్యోగులతో ప్లాట్ల, గృహాల విక్రయంపై అవగాహన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
మధ్యతరగతి ఉద్యోగులకు అందుబాటు ధరకే ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసుకునే వీలుందని చెప్పారు. ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు జిల్లా వెబ్సైట్ను సంప్రదించాలని పేర్కొన్నారు.