నిజామాబాద్, నవంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శని, ఆది వారాలు బ్యాంకులకు సెలవులు వచ్చినందున బహిరంగ వేలంలో పాల్గొనే వారి సౌకర్యార్థం పది వేల రూపాయల ఈ.ఎం.డి రుసుముకు సంబంధించిన డీ.డీలు తీసుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్)లో ప్రత్యేకంగా బ్యాంక్ కౌంటర్ ఏర్పాటు చేయించడం జరిగిందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కావున ధాత్రి టౌన్ షిప్ ప్లాట్ల వేలంలో పాల్గొనదల్చిన ఔత్సాహికులు ఈ నెల 14న సోమవారం బహిరంగ వేలంలో పాల్గొనడానికి కనీసం రెండు గంటల ముందు హాజరై ప్రత్యేక కౌంటర్ ద్వారా డీ.డీలు పొందగలరు. డీ.డీ లను డిస్ట్రిక్ట్ కలెక్టర్, నిజామాబాద్ పేరిట తీసుకోవాలి. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.