నందిపేట్, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటి పొలిసింగ్లో భాగంగా ఆదివారం స్థానిక మదర్సలో ఏర్పాటు చేసిన నందిపేట్ ముస్లిం కమిటీ సమావేశంలో నేరరహిత సమాజము కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నందిపేట్ ఎస్ఐ 2 ఎండి ఆరిఫుద్దీన్ పేర్కొన్నారు. నందిపేట్ గ్రామంలో గల నాలుగు మజీద్ల వద్ద మజీద్ కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు చాలా కీలకంగా పనిచేస్తాయని అన్నారు.
సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని ఆయాన తెలిపారు. ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగింది అని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో సిసి కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మండలంలో కృషి చేస్తున్నామని చెప్పారు.
సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, మరియు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపినారు. నేరాలను అదుపు చేయడం, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
అదేవిధంగా గంజాయి, డ్రగ్స్, జూదము లాంటి చెడు వ్యాసనాలకు యువతను దూరంగా ఉంచే విధంగా మజీద్ అధ్యక్షులు తమ తమ మజీద్ ఇమామ్ల ద్వారా యువతకు ప్రబోధనాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నందిపేట్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు అహ్మద్ ఖాన్, మండల అధ్యక్షుడు ఖలీల్ మహమ్మద్, ముస్లిం కమిటీ సభ్యులు, మజీద్ కమిటీ అధ్యక్షులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.