హైదరాబాద్, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడిరచారు. కార్డియాక్ ఆరెస్టుతో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డియాలజిస్టుల బృందం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది.
కృష్ణకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నాం. 24గంటల వరకు ఏమీ చెప్పలేం. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తాం అని వైద్యులు తెలిపారు.