కామారెడ్డి, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మధుమోహం దినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం శ్రీ పద్మావతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె పరీక్షలు, ఈసీజీ, బీపీ పరీక్షలు నిర్వహించారు.
కామారెడ్డి రూరల్ ప్రజలు 200 మందికి పైగా హాజరై ఉచిత పరీక్షలు చేసుకున్నారు. కార్యక్రమంలో శ్రీ పద్మావతి హాస్పిటల్ డాక్టర్ ఎన్ మౌనిక, ఎంబిబిఎస్, ఎండి, జనరల్ మెడిసిన్, డయాబెటిస్ స్పెషలిస్ట్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిరుపేద ప్రజలు వైద్య పరీక్షల కోసం హైదరాబాదు, నిజామాబాద్ వెళ్లకుండా శ్రీ పద్మావతి హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని కామారెడ్డి రూరల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.