కామారెడ్డి, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితరాణా పరిశీలించారు. పాత రాజంపేటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని చూశారు. జనవరి 1,2023 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.
గ్రామంలో మృతి చెందిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బూతు లెవెల్ అధికారి హారిక మాట్లాడారు. 19 మంది మృతి చెందిన వారు ఉన్నారని, వాటిని జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. దివ్యాంగుల వివరాలు అరా తీశారు. 90 ఏళ్ళు దాటిన వృద్ధుల వివరాలు అడిగారు. కొత్త ఓటర్లు దరఖాస్తు ఫారం తో పాటు, ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చని సూచించారు. యువజన సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి వంద శాతం ఓటర్ల నమోదు అయ్యేవిధంగా చూడాలన్నారు.
రాజకీయ పార్టీల ఏజెంట్లు ఓటర్ల నమోదుకు సహకరించాలని పేర్కొన్నారు. పాత ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. బూత్ లెవెల్ అధికారిని శైలజను బూత్‌లో ఎంతమంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల పర్యవేక్షణ అధికారిని యోగిత రాణా వివరాలు అడిగారు. 1022 ఓటర్లు ఉన్నారని బూత్ లెవల్ అధికారిని చెప్పారు. 250 మంది ఓటర్లు ఆధార్ అనుసంధానం చేశారని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, కామారెడ్డి ఆర్‌డిఓ శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల పర్యవేక్షణ అధికారి సాయి భుజంగరావు, ఎన్నికల డిప్యూటీ తాసిల్దారులు శ్రావణి, ఇందిరా ప్రియదర్శిని, అధికారులు పాల్గొన్నారు.