నిజామాబాద్, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమానికి వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్ హాజరై కాంగ్రెస్ భవన్ నుండి సాయిరెడ్డి పెట్రోల్ పంపు వరకు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ద్విచక్ర వాహనాలను తోచుకుంటూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చాలా అవకాశాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఏ దేశం నుండి పెట్రోల్ ,డీజిల్ దిగుమతి చేసుకుంటున్నామో ఆ దేశానికి భారతదేశం నుండి ముడి సరుకులు ఎగుమతి చేయడం జరుగుతుందని కావున ఎగుమతులు దిగుమతుల మధ్య పరస్పర సంబంధం ఏర్పరచి పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని, కేంద్ర ప్రభుత్వం ఇది ఏమీ ఆలోచించకుండా నిమ్మకు నీరెత్తినట్టు గా ప్రజల నడ్డి విరుస్తోందని ఆయన అన్నారు.
ప్రతి సామాన్య పౌరుడి నుండి రైతు వరకు అందరూ నిత్యావసర వస్తువుల వాడే పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి జిఎస్టి తగ్గించి వాటి ధరలను అదుపు చేసి ప్రజలకు అందించాలని, కానీ బిజెపి ప్రభుత్వం అధికార దాహంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు పెట్టి కరోనా వ్యాధిని నియంత్రించడంలో విఫలం చెందిందని, ఈ దేశంలో చాలా మంది మరణించడానికి చాలా కుటుంబాలు రోడ్డున పడటానికి కారణం కేంద్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా దేశంలో లక్షలాది మంది చనిపోవడం జరిగిందని, దేశంలో స్మశానాల ముందు శవాలను క్యూ లో పెట్టే పరిస్థితికి దేశాన్ని కేంద్ర ప్రభుత్వం దిగజార్చిందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కొత్త బిచ్చగాడు పొద్దుఎరగడు అన్నట్టు నరేంద్ర మోడీ అధికారం కోసం ఎగబడుతున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా కరోనా ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని, కేసీఆర్ అధికార దాహంతో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి కరోనా వ్యాధి వృద్ధి చెందడానికి కారణమయ్యారని కావున కేసీఆర్ దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క నెల రోజుల్లోనే నలభై నాలుగు సార్లు పెంచినటువంటి పెట్రోల్ ,డీజిల్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని, కేవలం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల వాహనదారులకు ఇబ్బంది కలగడమే కాకుండా అది నిత్యవసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతుందని కావున వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు.
పిసిసి ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ యొక్క అసమర్థ పాలన అని, ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్ ,డీజిల్ ధరలు పెంచడం జరుగుతుందని, గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అందజేయడం జరిగిందని ఆయన అన్నారు.
పెట్రోల్, డీజిల్ పై విపరీతమైన టాక్స్ లు వేసి ప్రభుత్వం దీని ద్వారా డబ్బులు రాబట్టే ప్రయత్నం చేస్తుందని కానీ ప్రజల కోసం ఉపయోగించడం లేదని స్పష్టం అవుతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
కార్యక్రమంలో పీసీసీ ప్రదాన కార్యదర్శి మాజిద్ ఖాన్, పిసిసి కార్యదర్శి రాంభూపాల్ , జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి , జిల్లా కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ , పి సి సి డెలికేట్ మహమ్మద్ ఈసా, ఓబిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా నరేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేశ మహేష్, మధుసూదన్ , అజీమ్ , 38 వ డివిజన్ కార్పొరేటర్ గడుగు రోహిత్, నగర కాంగ్రెస్ యువజన అధ్యక్షులు ప్రీతం, నగర మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఏజాజ్, నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్, నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజ్ గగన్, జియా, మోయిన్, కందికంటి నరేందర్ గౌడ్, నవాజ్, ఇలియస్, శకిల్, ప్రమోద్, జాకీర్, అక్బర్, నర్సింగ్ రావ్, నరేంద్ర సింగ్, ముష్షు పటేల్, ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు వరున్, ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి చింటూ, నాయకులు చిరు, శివ, మహేష్, అభిలాష తదితరులు పాల్గొన్నారు.