భీమ్‌గల్, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ కస్తూర్బా బాలికల విద్యా కేంద్రంలో చదువుకుంటున్న బాలికల కోసం రెండు వాలీబాల్‌లను, వలను, రెండు ఖోఖో స్తంభాలను ముత్యాల సునీల్ కుమార్ ఉచితంగా పంపిణీ చేసినట్లు దైడి సురేష్ బుధవారం తెలిపారు.
ఈ సందర్భంగా ముత్యాల సునీల్ బాలికల కోసం మంచి సందేశం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థినులు కేవలం మంచిగా చదువుకోవడమే కాకుండా మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని సూచించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే చదవులు ఒంటబడుతాయని చెప్పారు. జిల్లా బాక్సింగ్ ఆణిముత్యం నిఖత్ జరీన్ పేద కుటుంబం నుండి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిందని, ఇప్పుడు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం అభినందనీయమని అన్నారు.
ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా వివిధ క్రీడా రంగాల్లో చక్కగా రాణించాలని ఆకాంక్షించారు. బాలికల కోసం క్రీడా సామాగ్రిని అందజేసిన ముత్యాల సునీల్ కుమార్‌కు ప్రత్యేక అధికారిణి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సునీల్ యువసేన నాయకులు, కేజీబీవి ఉపాధ్యాయినీలు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.