డిచ్‌పల్లి, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో మల్లారం అర్జున్‌కి బుధవారం జరిగిన వైవా-వోక్ కార్యక్రమంలో డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేశారు. ఆచార్య ఎమ్. అరుణ పర్యవేక్షణలో అర్జున్ ‘‘క్యారెక్టరైజేషన్ ఆఫ్ సర్టైన్ మెంబెర్స్ ఆఫ్ సయనోబ్యాక్టీరియా ఐసోలెటెడ్ ఫ్రమ్ ద ప్యాడి ఫిల్డ్స్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్, ఇండియా’’ అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని తెయుకు సమర్పించారు.
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఆచార్య నిర్మల బాబురావ్ ఎక్స్టెర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. కాగా అర్జున్ తన పరిశోధనలో నిజామాబాద్ జిల్లాలోని వరి సాగులో నీలి ఆకుపచ్చ శైవలాలను పెంచడం వలన పంట దిగుబడి పెరుగుతుందని అన్నారు. ఈయన పరిశోధన ఫలితాలపై సంతృప్తి చెంది డాక్టరేట్ అవార్డును ప్రకటించారు.
కార్యక్రమంలో తెయు రిజిస్ట్రార్ మరియు వృక్షశాస్త్ర విభాగాధిపతి ఆచార్య బి. విద్యావర్ధిని, తెయు సైన్స్ డీన్ ఆచార్య ఎమ్. అరుణ, చైర్పర్సన్, బివోఎస్ డా. ఎ. ఎ. హలీమ్ ఖాన్, డా. దేవరాజు శ్రీనివాస్, డా. వి. జలంధర్, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా అర్జున్‌ని తెయు వీసి ఆచార్య రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య బి. విద్యావర్ధిని అభినందించారు.