ఆర్మూర్, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో డోనర్స్ డే నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సంతోష్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బుధవారం గత సంవత్సర దాతలను ఘనంగా సన్మానించడం జరిగిందని, దాతల విరాళాలు అన్ని కలిపి సుమారు 90 వేల రూపాయలు కాగ సంతోష్ రెడ్డి తన సొంత రూపాయలు 70 వేల రూపాయలు ప్రాథమిక పాఠశాలకు అందజేశారు.
పాఠశాల సమస్యల పట్ల గత సంవత్సరం ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సంవత్సరం కూడా పాఠశాలకు ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా దాతలు ముందుకు రావాలని వారు కోరారు. పిల్లలకు మంచి విద్య అందిస్తేనే రేపటి వారి భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పాఠశాలకు బేగిషాలు, బాసన్లు, ఆఫీస్ ఫర్నిచర్స్, నోట్‌బుక్స్, పెన్నులు, యూనిఫామ్స్, టై బెల్టులు వారి చేతుల మీదుగా పిల్లలకు అందజేశారు.
కార్యక్రమంలో ఎంఈఓ రాజ గంగారం, ప్రధానోపాధ్యాయుడు సూర్యారావు, హై స్కూల్ హెడ్మాస్టర్ హరిత, సొసైటీ చైర్మన్ కళ్ళెం బోజారెడ్డి, వీడిసి సభ్యులు, అధ్యక్షులు బార్ల గణపతి, గాండ్ల రామచందర్, హై స్కూల్ చైర్మన్ మగ్గిడి గంగారెడ్డి, ప్రైమరీ స్కూల్ చైర్మన్ వనిత, మా ఊరు స్వచ్చంద సంస్థ సభ్యులు, మోతె నారాయణ ఉమ్మడి గంగారెడ్డి, పిల్లల తల్లిదండ్రులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.