కామారెడ్డి, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిక్నూర్, దోమకొండ, బీబీపేట్, రాజంపేట, మాచారెడ్డి, రామారెడ్డి, తాడ్వాయి, లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, గాంధారి, సదాశివ నగర్, కామారెడ్డి రూరల్ మండలాల యువసమ్మేళనం ఈనెల 17న కామారెడ్డి పట్టణం సిరిసిల్లా రోడ్డులోగల రాజారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవ సమితి పత్రినిధులు తెలిపారు.
నైజాం అరాచక పాలన నుండి తెలంగాణ (హైదరాబాద్ సంస్థానం) విముక్తి పొంది 75 సంవత్సరాల స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా నిజమైన చరిత్రను యువతకు తెలియజేయాలనే సదుద్దేశంతో యువ సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 18-35 సంవత్సరాల వయస్సు గల యువతి, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.